Rajashekhar: నీలకంఠ దర్శకత్వంలో రాజశేఖర్ తాజా చిత్రం

Neelakantha to direct Rajashekhar
షార్ట్స్‌లో చూడండి
ఒకప్పుడు వెండితెర 'యాంగ్రీ యంగ్ మేన్'గా పేరుతెచ్చుకున్న డాక్టర్ రాజశేఖర్ ఒక తరహా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఎమోషనల్, యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలలో తనదైన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే, రాన్రాను ఆ చిత్రాల నిర్మాణంలో మొనాటనీ వచ్చేసి, రేసులో ఆయన వెనుకపడ్డారు. మళ్లీ ఆమధ్య వచ్చిన 'గరుడవేగ' సినిమాతో విజయాన్ని అందుకున్నారు. అయితే, ఆ తర్వాత ఆయన చేసిన 'కల్కి' మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది.

ఈ క్రమంలో పలు కథలు విన్న మీదట రాజశేఖర్ తాజాగా ఓ చిత్రాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. 'షో', 'మిస్సమ్మ', 'విరోధి' వంటి ఉత్తమ చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు నీలకంఠ చెప్పిన కథ నచ్చడంతో, చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ప్రస్తుతం పూర్తి స్క్రిప్టు పని జరుగుతోందనీ, త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తారని సమాచారం.  
Go Back to Shorts
Rajashekhar
Neelakantha
Garudavega
Kalki

More Telugu News