Ranbir Kapoor: దీపికా పదుకుణే, రణబీర్ కపూర్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్

Kangana Ranaut fires on Deepika Padukone and Ranbir Kapoor
  • రణబీర్ కపూర్ స్త్రీలోలుడు
  • దీపికా పదుకుణే ఒక సైకో
  • అయినా వారిని ఎవరూ ఏమీ అనరు
బాలీవుడ్ స్టార్ల మధ్య వివాదాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంచలన కామెంట్లు చేస్తూ వేడి పుట్టిస్తున్నారు. ఈ వరుసలో ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ముందు వరుసలో ఉంది. తాజాగా రణబీర్ కపూర్, దీపికా పదుకుణేలను ఆమె టార్గెట్ చేసింది. రణబీర్ కపూర్ స్త్రీలోలుడని వ్యాఖ్యానించింది. దీపిక ఒక మానసిక వ్యాధిగ్రస్తురాలని కామెంట్ చేసింది.

ప్రతిరోజు అమ్మాయిల వెంట పడే రణబీర్ ను ఎవరూ రేపిస్ట్ అని పిలవరని కంగన చెప్పింది. తనను తాను మానసిక వ్యాధిగ్రస్తురాలిగా దీపిక ప్రకటించుకుందని... అయినప్పటికీ ఆమెను ఎవరూ సైకో, రాక్షసి అని పిలవరని విమర్శించింది. సాధారణ కుటుంబాల నుంచి, చిన్న పట్టణాల నుంచి వచ్చే వారికి మాత్రం ఇలాంటి పేర్లు పెడతారని మండిపడింది.
Ranbir Kapoor
Kangana Ranaut
Deepika Padukone
Bollywood

More Telugu News