బిగ్ బాస్ నాలుగో సీజన్ షూటింగ్ స్టార్ట్... పిక్స్ పంచుకున్న నాగార్జున!
- నేను షూటింగ్ కు వెళుతున్నాను
- మళ్లీ షూటింగ్ నిజంగా అద్భుతం
- అన్నపూర్ణా స్టూడియోస్ లో చిత్రీకరణ
- వెల్లడించిన నాగార్జున
ఇదిలావుండగా, గత సీజన్ లలో 100 రోజుల పాటు సీజన్లు సాగగా, కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం దాన్ని 50 రోజులకే పరిమితం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక షోలో కౌగిలింతలు, కరచాలనాలు, దగ్గరకు తీసుకోవడాలు వంటి సీన్లు కనిపించక పోవచ్చని కూడా తెలుస్తోంది. టాస్కులు సైతం పోటీదారులు భౌతిక దూరం పాటిస్తూ పాల్గొనేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇందుకోసం ఫన్నీ టాస్క్ లను తయారు చేసేందుకు ఓ స్పెషల్ టీమ్ పనిచేస్తోందని సమాచారం. మొత్తం మీద ఈ సీజన్ సైతం రక్తి కట్టించేలానే ఉంటుందని బిగ్ బాస్ వర్గాలు అంటున్నాయి.