విమాన ప్రమాదంపై టీమిండియా క్రికెటర్ల స్పందన
- కోజికోడ్ విమానాశ్రయంలో ప్రమాదంపై ట్వీట్లు
- మృతులకు సంతాపం
- విమాన ప్రమాద వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని వ్యాఖ్య
- అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్లు
విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నానని టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. విమాన ప్రమాద వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని, బాధితులందరి కోసం ప్రార్థిస్తున్నానని టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. 2020 'ప్లీజ్ దయచూపు' అంటూ ఆయన పేర్కొన్నాడు.
కోజికోడ్ నుంచి భయంకరమైన వార్త విన్నానని, ఆ విమానం రెండు ముక్కలవ్వడం గురించి తెలుసుకుంటే భయమేసిందని గౌతం గంభీర్ చెప్పారు. అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. విమాన ప్రమాద బాధితుల కోసం ప్రార్థిస్తున్నానని కోహ్లీ అన్నాడు.
ప్రాణాలుకోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని చెప్పాడు. ఇదో షాకింగ్ న్యూస్ అని రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. విమాన ప్రమాదంలో గాయాలపాలైన ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని చెప్పాడు.