Ananya Pande: మహేశ్ సినిమాలో మరో నాయికగా బాలీవుడ్ నటి?

Ananya to be cast opposite Mahesh
షార్ట్స్‌లో చూడండి
స్టార్ హీరోల సినిమాలలో నటించే హీరోయిన్లు ఎవరన్నది అభిమానులకు ఆసక్తికరంగా వుంటుంది. అందులోనూ ఒకే సినిమాలో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు వుంటే అది మరీనూ. ఇక మహేశ్ బాబు లాంటి ఎంతో ఇమేజ్ వున్న హీరో సినిమాకు సంబంధించిన హీరోయిన్ల విషయమైతే అది మరింత ఆసక్తికరం. ఇక అసలు విషయంలోకి వస్తే, మహేశ్ బాబు సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే నటించనున్నట్టుగా వార్తలొస్తున్నాయి.

పరశురాం దర్శకత్వంలో మహేశ్ 'సర్కారు వారి పాట' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. బ్యాంక్ లలో జరిగే బడా మోసాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇక ఇందులో ఇప్పటికే ప్రధాన కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ విషయాన్ని కీర్తి ఇప్పటికే ప్రకటించింది కూడా.

ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా వుందట. దాని కోసం అనన్యను సంప్రదిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ద్వారా అనన్య పాండే టాలీవుడ్ కి పరిచయం అవుతోంది.    
Go Back to Shorts
Ananya Pande
Mahesh Babu
Vijay Devarakonda
Parashuram

More Telugu News