అందాల హీరోయిన్లు కంగనా, తాప్సీ మధ్య కొనసాగుతోన్న 'ఏ గ్రేడ్'.. 'బీ గ్రేడ్'‌ వ్యాఖ్యలు
Add ap7am to your home Screen

అందాల హీరోయిన్లు కంగనా, తాప్సీ మధ్య కొనసాగుతోన్న 'ఏ గ్రేడ్'.. 'బీ గ్రేడ్'‌ వ్యాఖ్యలు

kangana team counters tapsee
  • తాప్సీని 'బీ గ్రేడ్'‌ హీరోయిన్ అన్న కంగనా 
  • తనను తాను ఏ గ్రేడ్‌గా పరిగణించుకోలేదన్న తాప్సీ
  • కంగనా ఏ గ్రేడ్ హీరోయిన్‌ ఎలా అయిందోనంటూ వ్యాఖ్యలు
  • కంగనా సినిమాలో బాగా నటిస్తుందన్న కంగనా టీమ్
అందాల హీరోయిన్లు కంగనా రనౌత్, తాప్సీ కొన్ని రోజులుగా పరస్పరం విమర్శలు గుప్పించుకుంటోన్న విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలో బంధుప్రీతి గురించి వ్యాఖ్యలు చేస్తూ తాప్సీని 'బీ గ్రేడ్'‌ హీరోయిన్ అని కంగన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై స్పందించిన తాప్సీ కూడా దీటుగా సమాధానం ఇచ్చింది. వారి మధ్య మాటల తూటాలు ఇంకా పేలుతూనే ఉన్నాయి.

తాజాగా తాప్సీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కంగనా చేసిన వ్యాఖ్యలపై స్పందించింది. తనను తాను ఏ గ్రేడ్ హీరోయిన్‌గా తాను పరిగణించుకోలేదని ఆమె చెప్పింది. మరి కంగనా ఏ గ్రేడ్ హీరోయిన్‌ ఎలా అయిందో తనకు తెలియదని ఆమె ఎద్దేవా చేసింది. దీనిపై కంగనా టీం ట్విట్టర్ వేదికగా ఎంటరై కౌంటర్ ఇచ్చింది. కంగనా సినిమాలో బాగా నటిస్తుందని, ఆమెకు దృఢమైన వ్యక్తిత్వం వుందని, వీటన్నింటికి మించి క్వీన్‌, మణికర్ణిక వంటి హీరోయిన్‌ ప్రాధాన్యమున్న హిట్‌ చిత్రాల్లో నటించిందని చెప్పింది. ఒకే ఒక్క సోలో హిట్‌ సినిమా కూడా మనల్ని 'ఏ గ్రేడ్'‌ హీరోయిన్‌ను చేయగలదని చెప్పుకొచ్చింది.
tapsee
kangana ranaut
Bollywood

More Telugu News