సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'చంద్రముఖి' సీక్వెల్ లో కియరా
- బాలకృష్ణ సినిమాలో యంగ్ హీరో
- నాగశౌర్య చిత్రానికి భారీ బడ్జెట్
* బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో వచ్చే దృశ్యాలలో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తాడట.
* యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ఫస్ట్ లుక్ నిన్న విడుదల కాగా, దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 25 కోట్ల బడ్జెట్టుతో నిర్మిస్తున్నారట. నాగశౌర్య మార్కెట్టును బట్టి చూస్తే ఇది భారీ బడ్జెట్టు కిందే లెక్క.