ఏపీలో ప్రైవేటు ల్యాబ్ లకు కరోనా పరీక్షల ధరలు నిర్ణయించిన ఆరోగ్య శాఖ
- ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుకు రూ.750
- ఆర్టీపీసీఆర్ టెస్టుకు రూ.2,800
- ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు దరఖాస్తులు పంపాలని సూచన
ర్యాపిడ్ కిట్, పీపీఈ కిట్లు, మానవ వనరుల వ్యయం అన్నీ కలుపుకునే ఈ ధరను నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రభుత్వంతో పాటు ఐసీఎంఆర్ కు కూడా పరీక్షల ఫలితాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ పద్ధతిలో, ఈ ధరలతో కరోనా పరీక్షలు చేయదలుచుకున్న ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు ల్యాబ్ లు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.