భారత్ తో ఆడేందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనన్న పాక్ క్రికెట్ బోర్డ్
- భారత్, పాక్ ల మధ్య చాలా ఏళ్లుగా జరగని సిరీస్ లు
- 2013లో ఇండియా పర్యటనకు వచ్చిన పాకిస్థాన్
- భారత్ సిద్ధంగా ఉంటే తాము రెడీ అన్న పీసీబీ చైర్మన్
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్ లను భారత్ ఆపేసింది. కేవలం ప్రపంచ కప్, ఆసియాకప్ టోర్నీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి మాట్లాడుతూ, భారత్ తో ఆడటానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. అయితే ఈ విషయంలో తాము భారత్ వెంట పరుగెత్తమని తెలిపారు. తమతో ఆడేందుకు భారత్ సిద్ధంగా ఉంటే... తాము స్పందిస్తామని చెప్పారు.