ఆత్మహత్యా లేక హత్యా..!... సుశాంత్ సింగ్ రాజ్ పుత్ విషాదాంతంపై సినిమా
- 'సూసైడ్ ఆర్ మర్డర్' పేరిట సినిమా
- పోస్టర్ విడుదల చేసిన నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా
- సెప్టెంబరులో షూటింగ్
ప్రస్తుతానికి సగం స్క్రిప్టు పూర్తయిందని, సెప్టెంబరులో షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. తమ సినిమా చూస్తే బాలీవుడ్ లో బంధుప్రీతి, సినీ మాఫియాపై ఉన్న సందేహాలు తీరతాయని అన్నారు. ఇందులో సుశాంత్ వ్యవహారమే కాకుండా, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొని ఆత్మహత్యకు పాల్పడిన మరికొందరి జీవితాలను కూడా చూపిస్తున్నామని పేర్కొన్నారు.