బాటిల్‌లో పెట్రోలు పొయ్యబోమన్న బంక్ సిబ్బంది.. కోపంతో బంకులో పామును వదిలిన వైనం!
- మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘటన
- పెద్ద బాటిల్‌లో పామును తీసుకొచ్చి మహిళ ఉన్న కేబిన్‌లో వదిలిపెట్టిన వైనం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
వెంట తీసుకొచ్చిన ఆ బాటిల్‌లో పెద్ద పాము ఉంది. బాటిల్‌లో నేరుగా బంకులోని గది వద్దకు వెళ్లి అక్కడ పామును విడిచిపెట్టాడు. దాంతో ఆ సమయంలో ఆ గదిలో ఉన్న ఒకే ఒక్క మహిళ భయంతో వణికిపోయింది. అయితే, పాము లోపలికి రాకుండా బయటకు వెళ్లిపోవడంతో తేరుకుని అక్కడి నుంచి బయటకు పరిగెత్తింది. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియో బయటకు వచ్చి హల్‌చల్ చేస్తోంది.