సచిన్ పైలట్‌పై వేటును తప్పుబట్టిన సీనియర్ నేత సంజయ్ ఝాను పార్టీ నుంచి బహిష్కరించిన కాంగ్రెస్
- పార్టీ కోసం సచిన్ తన రక్తాన్ని ధారపోశారని వ్యాఖ్యలు
- రాజస్థాన్‌లో పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఆయనేనన్న ఝా
- పార్టీలో లోపాలను ఎత్తిచూపుతూ పత్రికలో వ్యాసం
ఆయన వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న అధిష్ఠానం పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఝాకు ఇదే తొలిసారి కాదు. పార్టీలో బోల్డన్ని లోపాలు ఉన్నాయంటూ ఇటీవల ఓ ప్రముఖ పత్రికలో వ్యాసం కూడా రాశారు. పార్టీ తరపున తరచూ ప్రసార మాధ్యమాల్లో పాల్గొనే ఝాను ఇటీవలే అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించింది. ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించింది.