మాస్కులు పెట్టుకోలేదని.. ఏకంగా కోటి రూపాయల జరిమానాలు విధించారు!
- నిబంధలనలను ఉల్లంఘిస్తున్నవారిపై ఉక్కుపాదం
- మాస్కులు ధరించని 46,959 మందికి జరిమానా
- భౌతికదూరం పాటించని 3,747 మందికి ఫైన్ వేసిన బెంగళూరు పోలీసులు
ఈ క్రమంలో మాస్క్ లేని వారిపై బెంగళూరు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నెల రోజుల వ్యవధిలో ఏకంగా రూ. కోటి జరిమానా విధించారు. జూన్ 9 నుంచి జులై 10 వరకు మొత్తం రూ. 1.01 కోట్లను వసూలు చేశారు. వీటిలో 46,959 కేసులు మాస్కులు ధరించనందుకు... 3,747 కేసులను సోషల్ డిస్టెన్స్ పాటించనందుకు విధించారు. బెంగళూరు పోలీసులు, నగర మున్సిపల్ అధికారులు జాయింట్ టీమ్ గా ఏర్పడి నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.