త్వరలో గుడ్‌న్యూస్.. డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్ పరీక్షా సామర్థ్యం మా సొంతం
- ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం కాబట్టే ఎక్కువ కేసులు
- కరోనాకు వ్యతిరేకంగా గొప్పగా పోరాడుతున్నాం
కొన్ని దేశాలు తమలా కాదని, అనారోగ్యంతో ఉన్నవారు, ఆసుపత్రికి వచ్చిన వారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆయా దేశాల్లో కేసులు ఎక్కువగా లేకపోవడానికి ఇదే కారణమన్నారు. తమకు కేసుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున పరిస్థితి కత్తిమీద సాములా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, మరణాల రేటు మాత్రం తమ వద్దే తక్కువని, తాము కొవిడ్‌కు వ్యతిరేకంగా గొప్పగా పోరాడుతున్నామని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ల ఫలితాలు బాగా వస్తున్నాయని, ఫలితంగా చికిత్స విధానంలో మంచి మార్పులు రాబోతున్నాయని ఆశిస్తున్నట్టు చెప్పిన అధ్యక్షుడు.. త్వరలోనే మంచి వార్తను అందించబోతున్నట్టు చెప్పారు.