బాలకృష్ణ సరసన ముంబై మోడల్!
- బాలకృష్ణ, బోయపాటి కాంబోలో మూడో సినిమా
- కొత్త హీరోయిన్ ని ఎంపిక చేస్తామన్న దర్శకుడు
- హీరోయిన్ ఎంపికపై త్వరలోనే అధికారిక ప్రకటన
ఈ నేపథ్యంలో ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒక అందమైన మోడల్ ని బాలకృష్ణ సరసన కథానాయికగా పరిచయం చేయాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో ప్రస్తుతం ముంబై మోడళ్లను సంప్రదిస్తున్నట్టు, త్వరలోనే ఒక అమ్మాయిని ఫైనల్ చేయనున్నట్టు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుంది. ఇక తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రానికి 'మోనార్క్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. బోయపాటి మార్కు యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇది రూపొందుతోంది.