Cow: ఆవుపై అత్యాచారం.. కామాంధుడిని ఉరి తీయాలని డిమాండ్!

షార్ట్స్‌లో చూడండి
జనాలు మానవత్వం మరిచి మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అమ్మాయిలు, మహిళలకే కాదు చివరకు జంతువులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. ఓ కామాంధుడు చేసిన పని ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. ఓ ఆవుపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ ఈ దారుణం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పాకలో కట్టేసిన ఆవు విచిత్రంగా అరుస్తుండటంతో యజమాని అక్కడకు వచ్చాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడంతో... సీసీటీవీలో చెక్ చేశాడు. అందులో రికార్డైన జుగుప్సాకరమైన దృశ్యాన్ని చూసి అతను షాక్ కు గురయ్యాడు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు.

నిందితుడి పేరు షబ్బీర్ అలీ అని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నారు. నిందితుడికి ఉరిశిక్షను వేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Go Back to Shorts
Cow
Rape
Madhya Pradesh

More Telugu News