Sushant Singh Rajput: హాట్ స్టార్ లో సుశాంత్ సింగ్ ఆఖరి సినిమా... అందరికీ ఉచితం!

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఆఖరు సినిమా 'దిల్ బేచారా' అతని అభిమానులతో పాటు అసంఖ్యాకమైన సినీ ప్రేక్షకులకు ఉచితంగా కనువిందు చేయనుంది. కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన ఈ చిత్రం, 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలకు సిద్ధమైంది.

హాలీవుడ్ లో వచ్చిన 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కు ఇది రీమేక్ గా తయారు కాగా, సంజనా సాంఘీ హీరోయిన్ గా నటించింది. క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఉచితంగా చూడవచ్చని, ప్రేమ, ఆశ, అంతులేని జ్ఞాపకాల సమాహారమే ఈ చిత్రమని డిస్నీ ప్లస్, హాట్ స్టార్ వెల్లడించింది.  

ఇదే సమయంలో ముఖేశ్ మాట్లాడుతూ, సుశాంత్ తనకు తొలి చిత్రం నుంచే తెలుసునని, తామిద్దరమూ కలిసి సినిమా చేయాలని ఎన్నో కలలు కన్నామని, అన్నింటినీ మిగిల్చి అతను వెళ్లిపోగా, ఇప్పుడు తాను ఒంటరిగా సినిమాను విడుదల చేస్తున్నానని భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు.

 కాగా, సుశాంత్ ఆఖరి చిత్రాన్ని థియేటర్ లో విడుదల చేసి తమకు చూపించాలని అతని ఫ్యాన్స్ కోరినా, ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు ఓటీటీ మాధ్యమంగానే విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నారు.
Sushant Singh Rajput
Dil Bechara
Sanjana Sanghi
Free

More Telugu News