సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

3 dead in a road accident in Suryapet today
  • విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్
  • వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టిన కారు
  • ఈ తెల్లవారుజామున ఘటన
తెలంగాణలోని సూర్యాపేటలో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్‌ను చివ్వెంల మండలం కాసింపేట రోడ్డు జంక్షన్ వద్ద  వెనక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సూర్యాపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుల వివరాలను సేకరిస్తున్నారు.

Go Back to Shorts
Telangana
Suryapet District
Road Accident

More Telugu News