Donald Trump: కరోనా చైనా వైరస్సే అని తెలిసేలా కొత్త పేరుతో పిలుస్తున్న ట్రంప్

 Donald Trump calls corona virus with a new name
షార్ట్స్‌లో చూడండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ ను చైనీస్ వైరస్, వుహాన్ వైరస్ అని పిలవడం తెలిసిందే. అయితే చైనా నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఆయన ఇతర పేర్లతో కరోనా వైరస్ ను పిలవడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు తాను ఈ వైరస్ మహమ్మారికి ఎన్ని పేర్లు పెట్టాడో ట్రంప్ ఓ ఎన్నికల సభలో చెప్పారు. తాజాగా 'కుంగ్ ఫ్లూ' అని పిలుస్తున్నానని వెల్లడించారు.

'కుంగ్ ఫూ' అనేది చైనా మార్షల్ ఆర్ట్స్ లో ఒకటి. సరిగ్గా ఆ పేరుకు దగ్గరగా చైనా ప్రస్తావన వచ్చేలా ట్రంప్ ఎంతో తెలివిగా 'కుంగ్ ఫ్లూ' అని నామకరణం చేశారు. కరోనా వైరస్ కు తాను ఇప్పటివరకు 19 పేర్లు పెట్టినట్టు వెల్లడించారు. కొందరు కరోనా వైరస్ అని పిలుస్తారని, తాను 'కుంగ్ ఫ్లూ' అని పిలుస్తానని ట్రంప్ ఉద్ఘాటించారు.
Go Back to Shorts
Donald Trump
Corona Virus

More Telugu News