అమెరికాలో మరో నల్ల జాతీయుడిని చంపేసిన పోలీసులు
- అట్లాంటాలో ఘటన
- రెస్టారెంటు ముందు కారు ఆపి నల్ల జాతీయుడి నిద్ర
- పోలీసులకు రెస్టారెంటు యజమాని ఫిర్యాదు
- తుపాకీ లాక్కొని పారిపోయేందుకు యత్నించిన నల్ల జాతీయుడు
ఈ విషయంపై పోలీసులకు ఆ రెస్టారెంట్ యజమాని ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడు మత్తులో ఉన్నట్లు తెలుసుకుని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా అతడు తిరగబడ్డాడు. అంతేగాక, ఓ పోలీసు తుపాకీని లాక్కొని పరుగులు తీశాడు. ఈ సమయంలో కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.