మరోసారి ముఖ్యమంత్రులతో మాట్లాడాలని ప్రధాని మోదీ నిర్ణయం

PM Modi will talk to Chief Ministers
  • ఈ నెల 16, 17 తేదీల్లో సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్
  • ఈ నెల 17న తెలుగు రాష్ట్రాల సీఎంలతో చర్చ
  • కరోనా పరిస్థితులపై సమావేశం
దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక పలుమార్లు సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి లాక్ డౌన్ అంశంపై మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో ముఖ్యమంత్రులతో మాట్లాడేందుకు షెడ్యూల్ రూపొందించారు. 16వ తేదీ మంగళవారం పంజాబ్, అసోం, కేరళ, ఉత్తరాఖండ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు.

ఇక, తెలుగు రాష్ట్రాల సీఎంలతో ఈ నెల 17న మాట్లాడనున్నారు. ఆ రోజున తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కాగా, ఇప్పటివరకు దేశంలో 2.98 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,498 మంది మరణించారు. 1.47 లక్షల మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
Go Back to Shorts
Narendra Modi
Prime Minister
Chief Minister
Video Conference
Lockdown
Corona Virus

More Telugu News