తెలంగాణ గవర్నర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు: బాలకృష్ణ

  • నిన్న పుట్టినరోజును జరుపుకున్న బాలయ్య
  • శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ గవర్నర్
  • చాలా సంతోషంగా ఉందన్న బాలయ్య
సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్న 60వ జన్మదినాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా బాలయ్యకు విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.

'తెలంగాణ గవర్నర్ తమిళిసైగారి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలను అందుకోవడం చాలా సంతోషంగా ఉంది' అంటూ ఫేస్ బుక్ లో బాలయ్య స్పందించారు. గవర్నర్ గా ఆమె బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆమెను కలిసి శుభాకాంక్షలను తెలిపినప్పటి ఫొటోను కూడా షేర్ చేశారు.

<iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FNandamuriBalakrishna%2Fposts%2F3230577333661110&width=500" width="500" height="613" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allow="encrypted-media"></iframe>

Balakrishna
Tollywood
Telugudesam
Telangana
Governor
Tamilisai Soundararajan

More Telugu News