అందుకే ఆ ఏనుగు చనిపోయింది: పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
- పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్ తిన్న ఏనుగు
- 14 రోజుల తర్వాత మృతి
- తీవ్ర నొప్పిని భరిస్తూ 14 రోజుల పాటు ఏమీ తినని వైనం
- ఏనుగు మృతికి ఊపిరితిత్తుల వైఫల్యమే కారణం
నీళ్లు కూడా తాగకుండా ఆకలితో అలమటించి, ఒకరోజు మొత్తం నదిలో ఉండిపోయిందని నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. చివరకు ఆ ఏనుగు నీరసించిపోయి నీటిలో పడిపోయిందని వివరించారు. ఆ ఏనుగు మృతికి ఊపిరితిత్తుల వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. కాగా, ఏనుగు చనిపోయే ముందు ఒక రోజు మొత్తం వెల్లియార్ నదిలోనే ఉన్న దృశ్యాలు ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే.