సింగర్‌తో బర్త్‌డే కేక్ కట్ చేయించి.. 'హాపీ బర్త్‌ డే టు యూ' అంటూ పాడిన బాలయ్య.. వీడియో ఇదిగో
Add ap7am to your home Screen

సింగర్‌తో బర్త్‌డే కేక్ కట్ చేయించి.. 'హాపీ బర్త్‌ డే టు యూ' అంటూ పాడిన బాలయ్య.. వీడియో ఇదిగో

balaiah song
  • వీడియో పోస్ట్ చేసిన శ్రేయాస్ మీడియా
  • బోయపాటి సినిమాలో నటిస్తోన్న బాలయ్య
  • ఆ సినిమా కోసం పాటలు పాడుతున్న గాయకుడు సింహా
గాయకుడు సింహా పుట్టినరోజు సందర్భంగా ఆయనతో సినీనటుడు నందమూరి బాలకృష్ణ కేక్ కట్ చేయించారు. అంతేకాదు.. 'హ్యాపీ బర్త్ డే టు యూ' అంటూ బాలయ్య పాటపాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను శ్రేయాస్‌ గ్రూప్‌ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు 'మోనార్క్' అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సింహా పాటలు పాడుతున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో బాలయ్య కూడా ఓ పాట పాడారని తెలిసింది. ఈ నెల 10వ తేదీన ఆ పాట విడుదల కాబోతోందని సమాచారం.

Balakrishna
Tollywood
Viral Videos

More Telugu News