బన్నీ సినిమా రీమేక్ లో రణ్ వీర్?
- భారీ హిట్ కొట్టిన 'అల వైకుంఠపురములో'
- భారీ రేటుకి హిందీ రీమేక్ హక్కులు
- ప్రచారంలో పలువురు హీరోల పేర్లు
- రణ్ వీర్ తో నిర్మాత సంప్రదింపులు
ఈ క్రమంలో బాలీవుడ్ నిర్మాత అశ్విన్ వర్ధే ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి సొంతం చేసుకున్నారు. అలాగే ఈ చిత్రం సాధించిన విజయాన్ని తెలుసుకున్న బాలీవుడ్ హీరోలు పలువురు ఈ రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆ విధంగా హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, చిత్ర నిర్మాత అశ్విన్ మాత్రం రణ్ వీర్ సింగ్ తో ఈ చిత్రాన్ని చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం ఈ విషయంలో ఆయన రణ్ వీర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.