హైటెన్షన్ విద్యుత్ తీగలపై నడుచుకుంటూ వెళ్లి.. కొమ్మను తొలగించిన ఉద్యోగి.. వీడియో ఇదిగో
- సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో ఘటన
- ఈదురుగాలులకు విరిగిన చెట్టు కొమ్మలు
- విద్యుత్ తీగలపై పడడంతో స్తంభమెక్కి తీసిన ఉద్యోగి
ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్లో చోటు చేసుకుంది. విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగి చేసిన ఈ సాహసం పట్ల అధికారులు మండిపడ్డారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అతడికి ఏ ప్రమాదమూ జరగలేదు. అతడు విద్యుత్ తీగతలపై నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.