తీరాన్ని తాకిన ఎమ్‌ఫాన్.. అల్లకల్లోలంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలు
- నాలుగు గంటలపాటు కొనసాగనున్న తీరం దాటే ప్రక్రియ
- ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల నుంచి 4.5 లక్షల మంది తరలింపు
- గంటకు 165 కి.మీ. వేగంతో వీస్తున్న గాలులు
మరోవైపు, తుపాను ప్రభావంతో బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రంలో పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న అలలు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ మహాపాత్రా తెలిపారు.
ముందుజాగ్రత్త చర్యగా కోల్‌కతా విమానాశ్రయాన్ని రేపు సాయంత్రం వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. తుపాను తీరం దాటాక గంటకు 110-120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అది బంగ్లాదేశ్ వైపు వెళ్లాక తీవ్ర వాయుగుండంగా మారి, ఆ తర్వాత బలహీనపడుతుందని అధికారులు పేర్కొన్నారు.