కాలాపానీ అనేది ఇండియా-నేపాల్ మధ్య సమస్య: చైనా
- కాలాపానీ వ్యూహాత్మకంగా భారత్ కు చాలా కీలకం
- ఇటీవలే చైనా సరిహద్దులకు ఆనుకుని ఉండే రోడ్డును ప్రారంభించిన భారత్
- అభ్యంతరం వ్యక్తం చేసిన నేపాల్
చైనా విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి ఝావో లిజియాన్ మీడియాతో మాట్లాడుతూ, కాలాపానీ అనేది ఇండియా, నేపాల్ దేశాల మధ్య ఉన్న సమస్య అని చెప్పారు. స్నేహపూర్వక సంప్రదింపుల ద్వారా ఈ సమస్యను ఇరు దేశాలు పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు. దూకుడుగా వ్యవహరిస్తే వివాదం మరింత క్లిష్టంగా మారుతుందని చెప్పారు.
భారత్ ప్రారంభించిన ఈ రహదారి వ్యూహాత్మకంగా భారత్ కు ఎంతో కీలకమైనది. దాదాపు 80 కిలోమీటర్ల పొడవుండే ఈ రహదారి ఉత్తరాఖండ్ లో చైనా సరిహద్దుకు ఆనుకుని ఉంటుంది. అయితే, ఈ రోడ్డుకు సంబంధించి నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి కాలాపానీ ప్రాంతం తమదని ఆ దేశం వాదిస్తోంది. భారత్ చర్యలు తమ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా ఉన్నాయని అంటోంది.