అమరావతిలో 'ఆర్ 5' జోన్ జీఓను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు!
- ఆర్5 జోన్ ను ప్రకటిస్తూ 355 గెజిట్ నోటిఫికేషన్
- నాలుగు వారాల పాటు సస్పెన్షన్
- తదుపరి విచారణ జూన్ 17కు వాయిదా
ఆర్5 జోన్ కింద రాజధానిలోని 29 గ్రామాల ప్రజలకే కాకుండా గుంటూరు, విజయవాడతో పాటు మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల వారికి కూడా ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు 1300 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. చట్టపరమైన ప్రక్రియ, నిబంధనలు పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని... సీఆర్డీయే సూత్రాలకు వ్యతిరేకంగా ప్రక్రియను చేపట్టిందని పిటిషన్ వేశారు.