పోలీసు చేసిన సాహసం వైరల్... మందలించి జరిమానా వేసిన ఎస్పీ!

Police stuns with Stunt on two cars
  • సినీ పక్కీలో ఎస్ఐ స్టంట్
  • రెండు కార్లపై రెండు కాళ్లతో విన్యాసాలు
  • రూ. 5 వేల జరిమానా, మందలింపు
మధ్యప్రదేశ్ లోని దామోహ్ ప్రాంతంలో రెండు కార్లపై నిలబడి సినీ పక్కీలో స్టంట్ చేసిన ఓ ఎస్ఐ వీడియో వైరల్ కావడంతో, ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించారు. వివరాల్లోకి వెళితే, జిల్లా పరిధిలోని నార్సింగ్ గర్డ్ ఎస్ఐ మనోజ్ యాదవ్, ఇటీవల అక్షయ్ కుమార్ 'సింగం' సినిమాలోని ఓ స్టంట్ ను అనుకరించాడు. రెండు కార్లపై రెండు కాళ్లను పెట్టి అతను నిలబడగా, కార్లు కదిలాయి.

ఈ వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ కావడంతో, అతని ప్రాణాంతక చర్యలపై విమర్శలు వచ్చాయి. దీంతో జిల్లా ఎస్పీ హేమంత్ చౌహాన్ విచారణకు ఆదేశించారు. మనోజ్ కుమార్ పై రూ. 5 వేల జరిమానా విధించామని అన్నారు. యువతపై చెడు ప్రభావాన్ని చూపే ఇటువంటి పనులు మరోసారి చేయవద్దని మందలించామని ఆయన తెలిపారు. మనోజ్ యాదవ్ చేసిన వీడియోను మీరూ చూడవచ్చు.
Go Back to Shorts
Madhya Pradesh
Police
Stunt
Fine

More Telugu News