స్వదేశం వచ్చేందుకు.. బంగారాన్ని అమ్ముకుంటున్న యూఏఈలోని భారత కార్మికులు
- ఉపాధి కోల్పోయి, వేతనాల్లో కోతతో ఇబ్బంది
- విమాన టికెట్ల కోసం బంగారాన్ని విక్రయించక తప్పని పరిస్థితి
- కిక్కిరిసిపోతున్న దుబాయ్‌లోని దుకాణాలు
ఈ నెల 7 నుంచి భారత్‌కు విమాన సర్వీసులు ప్రారంభమైనా విమాన టికెట్లకు డబ్బుల్లేకపోవడంతో తమ వద్ద ఉన్న బంగారాన్ని అమ్మేసుకుంటున్నారు. ఇలా బంగారాన్ని అమ్ముకుంటున్న వారితో దుబాయ్‌లోని మీనాబజార్, డేరా ప్రాంతాల్లోని చిన్నచిన్న బంగారు దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి. అదే బంగారాన్ని భారత్‌లో అమ్ముకుంటే 12 శాతం వరకు ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉన్నా మరో మార్గం లేక విక్రయిస్తున్నట్టు కొందరు కార్మికులు తెలిపారు.