మా నాన్న నన్ను ఎప్పుడూ తిట్టలేదు.. కొట్టలేదు: శ్రుతిహాసన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మా నాన్న నన్ను ఎప్పుడూ తిట్టలేదు.. కొట్టలేదు: శ్రుతిహాసన్

sriti hassan about her father
  • అభిమానులతో సోషల్ మీడియాలో మాట్లాడిన శ్రుతి
  • తండ్రి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన హీరోయిన్
  • గబ్బర్‌ సింగ్‌ సినిమాలో నటించడం అదృష్టమని వ్యాఖ్య
  • లాక్‌డౌన్‌ ఎత్తేశాక తాను మొదట పనికే ప్రాధాన్యమిస్తానన్న శ్రుతి
తన తండ్రి, సినీ నటుడు కమలహాసన్‌ తనను ఎప్పుడూ తిట్టడం కానీ, అరవడం కానీ చేయలేదని హీరోయిన్ శ్రుతిహాసన్ చెప్పింది. తాజాగా ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో మాట్లాడింది.

మీ తండ్రి కమల్ ఎప్పుడైనా మీకు పనిష్మెంట్ ఇచ్చారా? అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి ఆమె సమాధానం చెబుతూ, తనను ఆయన ఎన్నడూ కొట్టలేదని, తన తండ్రి అలా చేయరని పేర్కొంది. ప్రతి దానికి ఆయన వద్ద ఓ లాజిక్‌, కారణం ఉంటాయని తెలిపింది. ఒకసారి తాను ఓ తప్పుచేస్తే  తన తండ్రి తనతో చాలా నిరాశ చెందానని మాత్రమే అన్నారని చెప్పింది.

కాగా, కరోనా నేపథ్యంలో తన తండ్రి చెన్నైలోని ఇంట్లో క్వారంటైన్‌లో సంతోషంగా ఉన్నారని శ్రుతిహాసన్ చెప్పింది. లాక్‌డౌన్‌ ఎత్తేశాక తాను మొదట పనికే ప్రాధాన్యమిస్తానని తెలిపింది. పనిని బాగా మిస్‌ అవుతున్నానని చెప్పింది. టాలీవుడ్‌లో ఆమె నటించిన గబ్బర్‌ సింగ్ సినిమా విడుదలై ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా దానిపై స్పందిస్తూ.. ఆ హిట్ సినిమాలో నటించడం నిజంగా తన అదృష్టమని చెప్పింది. తనకు సంబంధించిన చాలా విషయాల్లో ఆ సినిమా మార్పునకు కారణమైందని వివరించింది.
sriti hassan
Kamal Haasan
Tollywood

More Telugu News