మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు వలస కూలీల దుర్మరణం
- హైదరాబాద్ నుంచి మామిడిపండ్ల లోడుతో ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న లారీ
- నర్సింగ్‌పూర్ జిల్లా పరా వద్ద బోల్తాపడిన లారీ
- తీవ్రంగా గాయపడిన మరో 11 మంది
ఈ ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన 11 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కూలీలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.