Corona Virus: కరోనాపై మరో పాటను విడుదల చేయనున్న రామ్ గోపాల్ వర్మ!

  I recorded a song called DEVUDI CORONA
షార్ట్స్‌లో చూడండి
'అది ఒక పురుగు.. కనిపించని పురుగు.. కరోనా అనే ఒక పురుగు' అంటూ కొవిడ్‌-19పై ఇప్పటికే ఒక పాట పాడి విడుదల చేసిన సినీ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మరో పాటను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.

'లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో నేను దేవుడి కరోనా అంటూ ఓ పాటను రికార్డ్‌ చేశాను. దేవుడు, కరోనా వైరస్‌ కలిసి డ్యూయెట్‌ సాంగ్ పాడినట్లు ఇది ఉంటుంది. ఈ రోజు సాయంత్రం  5.20 గంటలకు ఈ పాటను విడుదల చేస్తాను' అని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశారు.
Go Back to Shorts
Corona Virus
COVID-19
RGV

More Telugu News