తాగుడుకు డబ్బులివ్వని తల్లి.. చంపేసిన కొడుకు!
Add ap7am to your home Screen

తాగుడుకు డబ్బులివ్వని తల్లి.. చంపేసిన కొడుకు!

Mother killed by son in Vikarabad
  • వికారాబాద్ జిల్లా దుద్యాలలో ఘటన
  • డబ్బులు ఇవ్వనన్న తల్లి గొంతు నులిమి చంపేసిన కొడుకు
  • నిందితుడి కోసం గాలింపు
మద్యం కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వని తల్లిని గొంతునులిమి చంపేశాడో కొడుకు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బొంరాస్‌పేట మండలం దుద్యాలకు చెందిన అశోక్, మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాగుడుకు పూర్తిగా బానిసైన అశోక్.. గురువారం రాత్రి మద్యం కొనుగోలు కోసం డబ్బులు కావాలంటూ తల్లి అంజిలమ్మ (60)ని అడిగాడు. ఆమె డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అశోక్ తల్లిని గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Telangana
Vikarabad District
murder
Crime News

More Telugu News