సొంతూళ్లకు పంపాలంటూ రాజమహేంద్రవరంలో వలస కార్మికుల ఆందోళన
- నన్నయ వర్సిటీలోని పునరావాస కేంద్రంలో వలస కూలీలు
- రైల్వే స్టేషన్‌కు బయలుదేరిన 400 మంది
- ఇప్పటికిప్పుడు రైళ్లు సాధ్యం కాదనడంతో ఆందోళన
వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించడంతో.. ఈ ఉదయం వీరంతా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు లాలా చెరువు కూడలి వద్ద అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు పట్టించుకోకుండా ముందుకుసాగారు. ప్రత్యేక రైళ్లలో తమను సొంతూళ్లకు పంపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు రైళ్లు సాధ్యం కాదని, కొంత సమయం ఇవ్వాలని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో కూలీలు ఆందోళనకు దిగారు.