నాకు ఇష్టం లేదు... అయినా తప్పడం లేదు: మద్యం షాపుల ప్రారంభంపై కారణం చెప్పిన కేసీఆర్

06-05-2020 Wed 06:13 | Both States
  • తెలంగాణతో నాలుగు రాష్ట్రాలకు సరిహద్దు
  • ఆ నాలుగు రాష్ట్రాల్లో షాపులు తెరిచారు
  • మనం తెరవకుంటే స్మగ్లింగ్ పెరుగుతుందన్న కేసీఆర్
రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా నశించకుండానే మద్యం షాపులను తిరిగి ప్రారంభించడం తనకు ఇష్టం లేదని, అయినా తప్పడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రం నిర్ణయాల మేరకు సోమవారం నుంచి తెలంగాణకు సరిహద్దులను కలిగివున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మద్యం షాపులను తెరిచారని గుర్తు చేసిన ఆయన, ఆంధ్రప్రదేశ్ తో 890 కిలోమీటర్లు, మహారాష్ట్రతో సుమారు 700 కిలోమీటర్లు, కర్ణాటకతో 496 కిలోమీటర్లు, చత్తీస్ గఢ్ తో 235 కిలోమీటర్ల బార్డర్ ఉందని అన్నారు. ఈ సమయంలో తెలంగాణలో షాపులను తెరవకుంటే, లిక్కర్ స్మగ్లింగ్ పెరిగిపోతుందని, సరిహద్దు గ్రామాల ప్రజలు నిన్న, ఇవాళే హద్దులు దాటి పొరుగు రాష్ట్రాలకు వెళ్లి వచ్చారని, ఈ కారణంతో కరోనా వైరస్ మహమ్మారి తిరిగి వ్యాపించకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో మద్యం తయారు చేసే డిస్టిలరీల నుంచి కూడా ఒత్తిడి పెరిగిందని, దేశమంతా దుకాణాలు తెరిచి, మద్యం తయారీ కేంద్రాలు నడుస్తుంటే, తెలంగాణలో తాము నష్టపోతామని, తమకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని అంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడేసరికి రాష్ట్రంలో గుడుంబా రాజ్యమేలుతోందని, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఎంతో శ్రమించి, తెలంగాణ రాష్ట్రాన్ని గుండుంబా రహితంగా మార్చేందుకు కృషి చేశారని తెలిపారు. గుడుంబాపై ఆధారపడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయాలను చూపించి, వారిని మార్చామని, కానీ గత 45 రోజులుగా గుడుంబా తయారీ కేంద్రాలు వెలిశాయని, తిరిగి రాష్ట్రంలో గుడుంబా కనిపించకుండా చేస్తామని తెలిపారు.  వైన్స్  షాపులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ తెరచేవుంటాయని, కస్టమర్లు హడావుడి లేకుండా కొనుక్కోవచ్చని సూచించారు.
TelanganaWinesKCRReopen

More Telugu News

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30
..more