బాలకృష్ణతోనూ అనిల్ రావిపూడి మూవీ
- బోయపాటితో బాలకృష్ణ తాజా చిత్రం
- తదుపరి సినిమా బి.గోపాల్ తో
- లైన్లో అనిల్ రావిపూడి
బాలకృష్ణ 100వ సినిమా సమయంలోనే ఆయనకి అనిల్ రావిపూడి ఒక కథను వినిపించాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. మళ్లీ ఇటీవల బాలకృష్ణను కలిసి అనిల్ రావిపూడి ఒక కథను వినిపించాడట. బాలకృష్ణకి కథ నచ్చిందని అంటున్నారు. అయితే బోయపాటి, బి. గోపాల్ సినిమాల తరువాత బాలకృష్ణ; 'ఎఫ్ 3' .. మహేశ్ బాబు మూవీ పూర్తయ్యాక అనిల్ రావిపూడి ఫ్రీ అవుతారు. అప్పుడు ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.