చిరంజీవిగారితో ఉన్నంతసేపు గాల్లో తేలిపోయిన అనుభూతి కలిగింది: నటుడు అజయ్
- 'విక్రమార్కుడు'తో మంచి గుర్తింపు
- హీరోగాను కొన్ని ప్రయత్నాలు
- 'ఆచార్య'లో కీలకమైన పాత్ర
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'ఆచార్య' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాను. నా పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నా కెరియర్ కి ఈ పాత్ర చాలా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా సెట్లో చిరంజీవిగారిని కలుసుకున్నప్పుడు నేను పొందిన ఆనందం అంతా ఇంత కాదు. ఇన్నేళ్ల నా కెరియర్లో అంతకుముందు ఆయనను ఒకసారి మాత్రమే చూశాను. నన్ను ఆయన చాలా ఆప్యాయంగా పలకరించారు. నా సినిమాల గురించి ఆయన మాట్లాడుతుంటే, గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపించింది. ఆయనతో కలిసి పనిచేయడం ఓ అందమైన జ్ఞాపకంగా ఎప్పటికీ మిగిలిపోతుంది" అన్నారు.