మతిస్థిమితం లేని బాలికపై సామూహిక అత్యాచారం!
- హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్‌లో ఘటన
- బాలికపై నలుగురు యువకుల అత్యాచారం
- పోలీసుల అదుపులో నిందితులు
దీంతో కంగారుపడిన వారు వెంటనే దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక నుంచి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులు రెండు గంటల తర్వాత దేవేందర్‌నగర్‌లో బాలికను గుర్తించారు. అప్పటికీ ఆమెతోనే ఉన్న నిందితులు పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మిగతా ముగ్గురిని కూడా ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.