వచ్చే ఏడాది వరకు ప్రపంచమే మూతపడితే క్రికెట్ ఎక్కడ జరుగుతుంది?: అక్తర్
- మరో ఏడాది వరకు క్రికెట్ కష్టమేనన్న అక్తర్
- ఇప్పట్లో సాధారణ పరిస్థితులను ఆశించలేమని వ్యాఖ్యలు
- దేశాలు కోలుకునేందుకు మరికొంత సమయం పట్టొచ్చని వెల్లడి
ప్రపంచమే లాక్ డౌన్ అయిందని, ఇప్పట్లో సాధారణ వాతావరణం నెలకొంటుందని ఆశించలేమని పేర్కొన్నాడు. ఈ మహమ్మారి నుంచి ప్రపంచ దేశాలు కోలుకోవడానికి సంవత్సరం సమయం పట్టొచ్చని తెలిపాడు. ఇక, కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని బంతిపై బౌలర్లు ఉమ్మి పూసి రుద్దడాన్ని ఐసీసీ నిషేధిస్తే, ఆ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తానని అక్తర్ స్పష్టం చేశాడు. అయితే, కరోనా విజృంభణ చూశాక ఏ బౌలర్ కూడా బంతికి ఉమ్మి పూసేందుకు సాహసించకపోవచ్చని నవ్వుతూ అన్నాడు.