మద్యం దుకాణాలు తెరుస్తున్నాం: కీలక ప్రకటన చేసిన మహారాష్ట్ర
- ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రకటన
- రెడ్ జోన్ లేని ప్రాంతాల్లో అమ్మకాలకు అనుమతి
- వెల్లడించిన మహారాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే
లిక్కర్ షాపుల వద్ద సామాజిక దూరాన్ని పాటించడం తప్పనిసరని, రూల్స్ అన్నీ పాటిస్తేనే పర్మిషన్ ఉంటుందని, నిబంధనలను మీరినట్టు తేలితే, వెంటనే దుకాణం లైసెన్స్ ను రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు. కాగా, ఇప్పటికే మేఘాలయ, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు అనుమతించాయి. ఢిల్లీ సర్కారు సైతం మద్యం షాపులు తెరిచే ఆలోచన చేస్తోంది. తెలంగాణలోనూ వైన్స్ షాపులు తెరవాలన్న డిమాండ్ వస్తున్నప్పటికీ, ఇతర రాష్ట్రాలు అనుసరించే విధానాన్ని పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.