‘కోహ్లీ.. ఏయ్ కోహ్లీ..’ అంటూ పిలుస్తున్న అనుష్క శర్మ.. వీడియో ఇదిగో!
- లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన కోహ్లీ
- గ్రౌండ్ నే కాదు అభిమానుల ప్రేమను మిస్సయ్యాడన్న అనుష్క
- ‘కోహ్లీ.. చౌకా మార్నా’ అంటూ ఓ ఫన్నీ వీడియో పోస్ట్
లాక్ డౌన్ తో క్రికెట్ సిరీస్ లన్నీ రద్దు కావడంతో.. గ్రౌండ్ నే కాదు లక్షలాది అభిమానులు చూపే ప్రేమను కోహ్లీ మిస్సయ్యాడని అనుష్క ఆ పోస్ట్ లో పేర్కొంది. అభిమానులు చూపే ఆ అనుభవాన్ని తాను ఇస్తానంటూ ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేసింది. ఓ అభిమానిలా అనుష్క అరుస్తూ.. ‘కోహ్లీ.. ఏయ్ కోహ్లీ.. కోహ్లీ.. చౌకా మార్నా.. చౌకా మార్’ అనడం ఆ వీడియోలో ఉంది. అనుష్క మాటలకు స్పందనగా అక్కడే ఉన్న కోహ్లీ ఓ చూపు చూస్తూ.. తల అడ్డంగా ఊపుతూ ‘నో’ చెప్పడం కనపడుతుంది.