నా సినిమా వచ్చి మూడేళ్లు అయింది.. ఇక మళ్లీ ఆ తప్పు చేయను: కొరటాల శివ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా సినిమా వచ్చి మూడేళ్లు అయింది.. ఇక మళ్లీ ఆ తప్పు చేయను: కొరటాల శివ

Korata Siva revels the reason for 3 years gap
  • చిరంజీవిగారి గురించి వెయిట్ చేయడమే కారణం
  • పరిస్థితుల ప్రభావం వల్లే ఇలా జరిగింది
  • ఇకపై ఏ హీరో అందుబాటులో ఉంటే అతనితో సినిమా చేస్తా
టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన కొరటాల శివ చిత్రం వచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. మహేశ్ బాబు హీరోగా వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రమే కొరటాల శివ చివరి చిత్రం. ఆ తర్వాత ఆయన నుంచి మరో చిత్రం రాలేదు. దీనిపై తాజాగా ఆయన స్పందిస్తూ, చిరంజీవిగారి గురించి వెయిట్ చేయడమే దీనికి కారణమని చెప్పారు. దీనికి ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదని... పరిస్థితుల ప్రభావమే దీనికి కారణమని తెలిపారు. ఇకపై హీరోల గురించి ఎదురు చూడబోనని... ఏ హీరో అందుబాటులో ఉంటే, అతనితో సినిమా తీసేస్తానని చెప్పారు. ప్రస్తుతం చిరంజీవితో 'ఆచార్య' సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
Koratala Siva
Chiranjeevi
Tollywood

More Telugu News