ఇండియాలో 10 వేలు దాటిన కరోనా కేసులు... ఏ రాష్ట్రంలో ఎన్నంటే..!

Corona Toll Rises to Ten Thousand Cases
  • ఒక్క రోజులో 1,211 పాజిటివ్ కేసులు
  • మొత్తం 10,363కు చేరిన కేసుల సంఖ్య
  • అత్యధికంగా మహారాష్ట్రలో కేసులు, మరణాలు
గడచిన 24 గంటల్లో 1,211 కొవిడ్-19 పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడంతో, మొత్తం కేసుల సంఖ్య ఇండియాలో 10 వేలను దాటేసింది. దేశంలో 10,363 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఇప్పటివరకూ 339 మంది మరణించారని, ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 1,035 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.

ఇక, మహారాష్ట్రలో అత్యధికంగా, 2,334 కేసులు నమోదు కాగా, ఆపై ఢిల్లీలో 1,510 కేసులు, తమిళనాడులో 1,173 కేసులు నమోదయ్యాయి. ఇండియాలో నమోదైన మొత్తం కేసుల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనే 50 శాతం కేసులు ఉండటం గమనార్హం. ఆ తరువాత రాజస్థాన్ లో 873, మధ్య ప్రదేశ్ లో 604, తెలంగాణలో 562, ఉత్తర ప్రదేశ్ లో 558, గుజరాత్ లో 539 కేసులు వచ్చాయి.

మొత్తం నమోదైన 339 మరణాల్లో మహారాష్ట్రలోనే దాదాపు సగం... అంటే 160 మంది మరణించారు. ఆపై మధ్యప్రదేశ్ లో 43, ఢిల్లీలో 28 మంది, గుజరాత్ లో 26 మంది మరణించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకూ దేశంలో 2 లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.

మిగతా రాష్ట్రాల్లోని కేసులను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ లో 432, అండమాన్ దీవుల్లో 11, అసోంలో 31, బీహార్ లో 65, చండీగడ్ లో 21, చత్తీస్ గఢ్ లో 31, గోవాలో 7, గుజరాత్ లో 539, హర్యానాలో 185, హిమాచల్ ప్రదేశ్ లో 32, జమ్మూ కశ్మీర్ లో 270 కేసులు నమోదయ్యాయి.

ఇక ఝార్ఖండ్ లో 24, కర్ణాటకలో 247, కేరళలో 379, లడఖ్ లో 15, మణిపూర్ లో 2, ఒడిశాలో 54, పుదుచ్చేరిలో 7, పంజాబ్ లో 167, త్రిపురలో 2, ఉత్తరాఖండ్ లో 35, పశ్చిమ బెంగాల్ లో 190 కేసులు నమోదు కాగా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.
Go Back to Shorts
India
Corona Virus
Maharashtra
Tamilnadu
New Cases

More Telugu News