నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో భూమిక!

Boyapati Movie
  • హీరోయిన్ గా భూమికకు మంచి పేరు
  • రీ ఎంట్రీలో కీలకమైన పాత్రలు
  • బాలకృష్ణ మూవీలో మరోసారి ఛాన్స్
తెలుగు తెరపై నిన్నటి తరం కథానాయికగా భూమిక మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. కొంతకాలం పాటు సినిమాకి దూరంగా వున్న ఆమె, ఆ తరువాత రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలోను ఆమె అక్క .. వదిన వంటి పాత్రలలో ముఖ్యమైనవి ఎంచుకుంటోంది. తన పాత్రకి ప్రాధాన్యత ఉంటేనే అంగీకరిస్తోంది. అలా భూమిక చేసిన 'యూ టర్న్' .. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' .. 'సవ్యసాచి' సినిమాలు ఆమెకి మంచిపేరు తెచ్చిపెట్టాయి.

ఈ మధ్య వచ్చిన 'రూలర్'  సినిమాలోనూ భూమిక నటించింది. ఆ తరువాత బాలకృష్ణ చేస్తున్న సినిమాలోను ఆమెకి ఛాన్స్ దొరకడం విశేషం. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం భూమికను తీసుకున్నారట. ఆమె పాత్ర నెగెటివ్ షేడ్స్ కలిగినదిగా ఉంటుందని చెబుతున్నారు. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Go Back to Shorts
Balakrishna
Boyapati Sreenu
Bhumika

More Telugu News