బాలీవుడ్ సినీ కార్మికులకు రూ. 3000 చొప్పున ట్రాన్స్ ఫర్ చేసిన సల్మాన్ ఖాన్
- లాక్ డౌన్ నేపథ్యంలో రోజు వారీ సినీ కార్మికులకు అండగా సల్మాన్
- ఇచ్చిన మాట ప్రకారం ఆర్థికసాయం
- కొంత కాలం తర్వాత మరికొంత బదిలీ
ఇప్పటి వరకు 23,000 మంది సినీ కార్మికులతో కూడిన జాబితాను సల్మాన్ కు అందజేశామని, దాని ప్రకారం ఆయా అకౌంట్లకు మూడు వేల రూపాయల చొప్పున మనీ ట్రాన్స్ ఫర్ చేశారని అన్నారు. కొంత కాలం తర్వాత మళ్లీ మరికొంత మొత్తాన్ని ఆయా వర్కర్లకు బదిలీ చేస్తారని చెబుతూ, సినీ కార్మికులకు అండగా నిలుస్తున్న సల్మాన్ కు ధన్యవాదాలు తెలియజేశారు.