‘విజ్డన్’ లీడింగ్ క్రికెటర్‌గా బెన్ స్టోక్స్!
- వన్డే ప్రపంచ కప్ హీరోకు అరుదైన గౌరవం
- ఉత్తమ మహిళా క్రికెటర్ గా ఎలైస్ పెర్రీ
- భారత క్రికెటర్లకు నిరాశే
ఇలా వారాల వ్యవధిలోనే స్టోక్స్ తన కెరీర్ లో చిరకాలం గుర్తిండిపోయే రెండు ఇన్నింగ్స్‌లు ఆడాడని విజ్డన్ ఎడిటర్ లారెన్ బూత్ కొనియాడారు. ఐసీసీ జనవరిలో ప్రకటించిన వార్షిక పురస్కారాల్లో స్టోక్స్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇక, వరల్డ్ కప్ ఫైనల్లో సూపర్ ఓవర్ వేసిన ఇంగ్లండ్ పేసర్ జొఫ్రా ఆర్చర్... విజ్డన్ ఎంపిక చేసిన ఐదుగురు క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ జాబితాలో అతనితో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాట్ కమిన్స్, మార్నస్ లబుషేన్, ఎలైస్ పెర్రీ, దక్షిణాఫ్రికాలో పుట్టిన ఇంగ్లిష్ కౌంటీ టీమ్ ఎసెక్స్ స్పిన్నర్ సైమన్ హార్మర్ కూడా ఉన్నారు.
ఎలైస్ పెర్రీ ఉత్తమ మహిళా క్రికెటర్ గా కూడా నిలిచింది. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన నుంచి ఆమె ఈ టైటిల్ కైవసం చేసుకుంది. విజ్డన్ పురస్కారాల్లో ఈసారి భారత్ నుంచి ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోవడం గమనార్హం.