ఆంధ్రాబ్యాంకు... ఇక ముగిసిన అధ్యాయం!

01-04-2020 Wed 13:11 | Business
  • నేటి నుంచి యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం
  • ఇన్నాళ్లు ఆంధ్రులకు గుర్తింపుగా ఓ లోగో
  • ఉద్యోగుల వ్యతిరేకతను పట్టించుకోని ప్రభుత్వం
బ్యాంకింగ్‌ రంగంలో తెలుగువారికో గుర్తింపు, గౌరవం అన్నట్లు ఇన్నాళ్లు కొనసాగిన ఆంధ్రాబాంక్‌ అధ్యాయం ఇక ముగిసినట్టే. 97 ఏళ్లుగా సేవలందిస్తున్న ఈ ఆర్థిక రంగ సంస్ధ నేడు కనుమరుగయింది. బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రాబ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంకులను యూనియన్‌ బ్యాంక్‌లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి రావడంతో ఇకపై ఆంధ్రాబ్యాంక్‌ లోగోకు బదులు యూనియన్‌ బ్యాంకు లోగో లేదా కొత్త లోగో దర్శనమిస్తుంది.

 ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923 నవంబరులో ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారు. 1980 ఏప్రిల్‌లో జాతీయ బ్యాంకుగా అవతరించింది. 2019 మార్చి నాటికి 26 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2,885 శాఖలు, 3,798 ఏటీఎంలకు ఆంధ్రాబ్యాంకు విస్తరించింది. 1981లో దేశంలో తొలిసారిగా క్రెడిట్‌ కార్డుల వ్యాపారాన్ని ప్రారంభించింది ఆంధ్రాబ్యాంకే.

అంతటి చరిత్ర ఉన్న బ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ చాలారోజులపాటు ఉద్యోగులు ఆందోళనలు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తననుకున్నట్టే విలీన ప్రక్రియను పూర్తిచేసింది. అయితే లోగో మారినా బ్యాంక్‌ జోనల్‌ కార్యాలయాలు, లీడ్‌ బ్యాంకు కార్యాలయాలు యథావిధిగా అవే భవనాల్లో కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు.
Andhra bankUnion Bankmerging

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more