కాజోల్, నైసా బాగున్నారు.. పుకార్లను నమ్మొద్దు: అజయ్ దేవగణ్
Add ap7am to your home Screen

కాజోల్, నైసా బాగున్నారు.. పుకార్లను నమ్మొద్దు: అజయ్ దేవగణ్

Kajol and Nysa are fine says Ajay Devgn
  • కాజోల్, నైసాలకు కరోనా పాజిటివ్ అని వార్తలు
  • ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారన్న అజయ్ దేవగణ్
  • ఇవన్నీ నిరాధారమైన వార్తలంటూ వ్యాఖ్య
తన భార్య కాజోల్, కుమార్తె నైసా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ స్పష్టం చేశాడు. కాజోల్, నైసాలకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ మీడియాలో వార్తలు రావడంతో ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇదంతా అసత్యపు ప్రచారమేనని, నిరాధారమైనదని తెలిపారు. అజయ్ దేవగణ్, కాజోల్ పలు చిత్రాల్లో నటించారు. దిల్ క్యా కరే, ప్యార్ తో హోనా హీ థా, రాజూ చాచా, గూండారాజ్ తదితర చిత్రాలను చేశారు. 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు నైసా, కుమారుడు యుగ్ ఉన్నారు.
Ajay Devgn
Kajol
Nysa
Corona Virus
Bollywood

More Telugu News